ఆసీ, బేబమ్మలకు మైత్రీ నిర్మాతల భారీ నజరానాలు

Published on Feb 26, 2021 10:11 pm IST

సినిమా విజయం సాధిస్తే హీరో హీరోయిన్లకు, దర్శకుడికి నిర్మాతలు బహుమతులు ఇవ్వడం మామూలే. అదే సినిమా ఊహించిన స్థాయికి మించి సక్సెస్ అయితే వారి పారితోషకాన్ని డబుల్ చేసి ఇస్తామని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అంటున్నారు. అవును.. ఈ ఏడాది మైత్రీ మూవీస్ నుండి వచ్చిన ఉప్పెన భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలిరోజు నుండే వసూళ్ళలో దూకుడు చూపించిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ట్రేడ్ లెక్కల మేరకు రెండు వారాలకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.48 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది.

నిర్మాతలు, చిత్ర బృందం సినిమా విజయాన్ని గెస్ చేశారు కానీ ఈ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదు. అందుకే ఆ ఆనందంలో నిర్మాతలు చిత్ర బృందానికి బహుమతులు ఇస్తున్నారు. అవి ఆషామాషీ బహుమతులు కాదండోయ్ భారీ బహుమతులు. మొదట దర్శకుడు బుచ్చిబాబుకు రెండు క్లాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చిన నిర్మాతలు ఈసారి హీరో హీరోయిన్లకు కళ్ళు చెదిరే నజరానా ఇచ్చారు. హీరో వైష్ణవ్ తేజ్ కు పారితోషకం కాకుండా అధికంగా కోటి రూపాయలు హీరోయిన్ కృతి శెట్టికి రూ.25 లక్షలు ఇచ్చారట. డెబ్యూ హీరో హీరోయిన్లకు లాభాల నుండి ఈ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం మైత్రీ నిర్మాతల పెద్ద మనసుకు, హుందాతనానికి నిదర్శనం.

సంబంధిత సమాచారం :