విజయ్ దర్శకుడితో మైత్రి భారీ చిత్రం?

Published on Aug 4, 2020 12:18 pm IST

కోలీవుడ్ లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి మంచి పేరుంది. ఆయన వైవిధ్యమైన చిత్రాలతో ఆయన సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక గత ఏడాది విడుదలైన ఖైదీ మూవీ ఆయన ఇమేజ్ భారీగా పెంచివేసింది. ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకుండా హీరో కార్తితో చేసిన ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం లోకేష్ హీరో విజయ్ తో మాస్టర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

కాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లోకేష్ కనకరాజ్ తో ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో ఓ మూవీ చేయడానికి లోకేష్ సైన్ చేశారట. ఐతే ఈ భారీ చిత్రంలో నటించే హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సివుంది. కాగా తెలుగులో పుష్ప, సర్కారు వారి పాట అనే భారీ చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More