‘నా సామిరంగ’ : మూడవ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

‘నా సామిరంగ’ : మూడవ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Jan 5, 2024 2:05 AM IST


కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రాజ్ తరుణ్, అల్లరి నరేష్, ఆశికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నా సామిరంగ. ఈ మూవీ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆకట్టుకోగా మూవీ నుండి మూడవ సాంగ్ ని రేపు ఉదయం 10 గం. 08 ని. లకు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక చిన్న వీడియో బైట్ ద్వారా అనౌన్స్ చేసారు. యువ గాయకుడు శాండిల్య పీసపాటి ఈ హార్ట్ టచింగ్ ని ఆలపించినట్లు మేకర్స్ తెలిపారు. మరి మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన నా సామిరంగ మూవీ జనవరి 14న రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో విజవంతం అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు