విడుదల తేదీ : జనవరి 14, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్, షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు
దర్శకుడు : విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీత దర్శకులు: ఎం ఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర
ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో అక్కినేని నాగార్జున నటించిన మరో విలేజ్ డ్రామా “నా సామిరంగ” కూడా ఒకటి. మరి నేడే విడుదల అయ్యిన ఈ చిత్రం ఎంతమేర అలరించిందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే..1960వ దశకంలో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ప్రాంతంలో పేరు మోసిన వ్యక్తి అందరూ పెద్దయ్యగా పిలుచుకునే నాజర్ ని ఓ ప్రమాదం నుంచి ఇద్దరు అనాథ పిల్లలు అయినటువంటి కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) లు కాపాడుతారు. అక్కడ నుంచి కిష్టయ్యని కూడా తన కొడుకుల్లో ఓ కొడుకుగా పెద్దయ్య పెంచుకుంటాడు. మరి అలా పెంచుకున్న పెద్దయ్య కోసం కిష్టయ్య ఎంతవరకు వెళ్లగలడు? పెద్దయ్య కొడుకుల్లో ఒకడైన దాసు(షబీర్ కల్లరక్కల్) కి కిష్టయ్య కి మధ్య వైరం ఎలా ఏర్పడుతుంది? ఈ క్రమంలో వరాలు(ఆశికా రంగనాథ్) పాత్ర ఏంటి అసలు అంజికి ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మంచి క్యాస్టింగ్ కనపడుతుంది. ఒకో పాత్రకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా ఒకొకరు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. మరి మొదటిగా కింగ్ నాగార్జున నుంచే మొదలు పెడితే నాగ్ తన రోల్ లో ఇమిడిపోయారు. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత మళ్ళీ ఆ తరహా మాస్ రోల్ లో తన యాస నడవడిక మెయిన్ గా తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. ఇక తనపై యాక్షన్ పార్ట్ కూడా సాలీడ్ గా కనిపిస్తుంది.
అలాగే తనకి జోడీగా నటించిన ఆశికా రంగనాథ్ తన పాత్రలో డీసెంట్ గా కనిపిస్తుంది గార్జియస్ లుక్స్ సహా నటన పరంగా ఆమె ఆకట్టుకుంటుంది. వీరితో పాటుగా అల్లరి నరేష్ కి మరోసారి మంచి పాత్ర ఈ సినిమాలో దక్కింది అని చెప్పాలి. తన మార్క్ కామెడీ అనే కాకుండా పలు కీలక ఎమోషనల్ సీన్స్ లో కూడా తాను ఇంప్రెస్ చేసాడు. అలాగే రాజ్ తరుణ్, మిర్నా, రుక్షర్ దిల్లాన్ తదితరులు కూడా తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మరో నటుడు విలన్ గా కనిపించిన షబీర్ మాత్రం తన రోల్ ని చాలా బాగా చేసాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో సెకండాఫ్ లో ఓ కీలకమైన ఎమోషనల్ సీన్ అయితే కదిలిస్తుంది. అలాగే దాని అనుగుణంగా వచ్చే క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి మాస్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కాస్త డిజప్పాయింట్ చేసే అంశాలు ఎక్కువే ఉంటాయని చెప్పాలి. ఈ సినిమాని కూడా చాలా మంది నాగ్ నుంచి ఓ ప్రాపర్ పండుగ ఎంటర్టైనర్ గా భావించి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అందుకు భిన్నమైన ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. సినిమా ఫస్టాఫ్ నుంచి కూడా అంత ఎంగేజింగ్ నరేషన్ ఎక్కడా కనిపించదు.
ఎక్కడో కొన్ని కొన్ని కామెడీ సీన్స్ మినహా మిగతా అంతా చాలా చప్పగానే అనిపిస్తుంది. అలాగే నాగార్జున ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఇంకాస్త బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఇక సెకండాఫ్ కూడా అంత ఆసక్తి గా ఏమి స్టార్ట్ అవ్వదు మాస్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళడానికి కూడా కాస్త సమయం పడుతుంది.
దీనితో సినిమా ఇక్కడ నుంచి బాగుంది అని అనుకోడానికి మాత్రం ఆడియెన్స్ కి చాలా సమయం పడుతుంది. అలాగే చాలా సీన్స్ మనకి రెగ్యులర్ గా ఇది వరకే కొన్ని సినిమాల్లో చూసేసినట్టే అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో కొన్ని సాంగ్స్ కానీ ఫస్టాఫ్ లో సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఎఫెక్టీవ్ గా అనిపించవు. అలాగే కొన్ని చోట్ల గ్రాఫిక్ విజువల్స్ తెలిపోయాయి.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. వింటేజ్ బ్యాక్ డ్రాప్ కి కావాల్సిన టోటల్ సెటప్ ని మైంటైన్ చేయడం బాగుంది. టెక్నీకల్ టీం లో ఆర్ట్ వర్క్ ని మెచ్చుకోవాలి. ఇక కీరవాణి సంగీతం పర్వాలేదు. క్లైమాక్స్ లో స్కోర్ మాత్రం చాలా బాగుంది. దాశరధి సినిమాటోగ్రఫి వింటేజ్ ఫీల్ ని తీసుకొస్తుంది. ఎడిటింగ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించాల్సింది.
ఇక దర్శకుడు విజయ్ బిన్నీ విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి ఓకే అనిపించే వర్క్ చేసాడని చెప్పాలి. మెయిన్ లీడ్ అందరి నుంచి మంచి పెర్ఫార్మన్స్ లను తాను రాబట్టుకున్నాడు. కానీ కథనంని మాత్రం అంత ఆసక్తిగా మలచడంలో విఫలం అయ్యాడని చెప్పక తప్పదు. సినిమాని ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి చాలా సమయం తీసుకున్నాడు తాను. వీటితో మాత్రం తన వర్క్ యావరేజ్ గానే అనిపిస్తుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే పండుగ కానుకగా వచ్చిన “నా సామిరంగ” నాగ్ ఫ్యాన్స్ వరకు మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. అలాగే అల్లరి నరేష్ ఈ చిత్రానికి మరో పిల్లర్ గా నిలవగా అక్కడక్కడా ఆకట్టుకునే కామెడీ సెకండాఫ్ లో పలు ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ పోర్షన్ లు అలరిస్తాయి. కానీ రొటీన్ కథా, కథనాలు మాత్రం అంతగా మెప్పించవు. వీటితో అయితే ఈ పండుగకు ఫ్యామిలీస్ వరకు ఈ చిత్రం ఒక్కసారికి డీసెంట్ ట్రీట్ ఇస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team