నారప్ప గురించి అప్పుడే గుడ్ రిపోర్ట్స్

నారప్ప గురించి అప్పుడే గుడ్ రిపోర్ట్స్

Published on Mar 21, 2020 9:57 AM IST

కెరీర్ బిగినింగ్ నుండి విక్టరీ వెంకటేష్ రీమేక్స్ పై ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. రీమేక్స్ తో ఆయన చంటి, రాజా, సూర్యవంశం, సుందరకాండ వంటి అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆయన రీమేక్స్ లిస్ట్ రెండు పదులు దాటిపోయింది. తాజాగా ఆయన తమిళ హిట్ మూవీ అసురన్ రీమేక్ లో నటిస్తున్నారు. నారప్ప పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

మొదటిసారి కల్ట్ డీగ్లామర్ రోల్ లో వెంకటేష్ కనిపిస్తుండగా అప్పుడే ఈ చిత్రం నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇటీవలే ఓ లాంగ్ షెడ్యూల్ నిర్వహించగా నారప్పగా వెంకటేష్ ఇరగదీశాడట. అలాగే ఈ మూవీ అవుట్ ఫుట్ పట్ల చిత్ర యూనిట్ చాల సంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. నారప్ప సూపర్ హిట్ అవడం ఖాయం అని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు