సమీక్ష : నారి – కథాంశం బాగున్నా.. కథాకథనాలు ఆకట్టుకోవు!

సమీక్ష : నారి – కథాంశం బాగున్నా.. కథాకథనాలు ఆకట్టుకోవు!

Published on Mar 7, 2025 7:20 PM IST

Naari Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 07, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : ఆమని,కేదార్ శంకర్, నిత్య శ్రీ, కార్తికేయ దేవ్,
దర్శకుడు : సూర్య వంటిపల్లి
నిర్మాతలు : శశి వంటిపల్లి
సంగీతం : వినోద్ కుమార్ విన్ను
సినిమాటోగ్రఫీ : వి రవి కుమార్, భీమ్ సాంబ
ఎడిటర్ : మాధవ్ కుమార్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

సీనియర్ నటి ఆమని, యువ నటీనటులు వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా “నారి”. ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

భారతి (ఆమని) పుట్టినప్పటినుంచి ఆమెకు అన్నీ కష్టాలే. ఆమె తండ్రి కూడా భారతిని ప్రేమగా చూసుకోడు. సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలన్నీ భారతి జీవితంలో ఉంటాయి. తండ్రి ఆదరణ లేకపోవడంతో, అదే సమయంలో ఆనంద్ (వికాస్ వశిష్ఠ) ఆమె జీవితంలోకి వస్తాడు. ప్రేమ అంటూ భారతిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తాడు. అది తెలిసి భారతి తండ్రి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి భారతి, ఆనంద్ తో వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో భారతి మోసపోతుంది. అసలు ఆనంద్ ఎవరు ?, అతని నిజ స్వరూపం ఏమిటి?, చివరకు భారతి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది?, ఫైనల్ గా భారతి తన కొడుకు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం బాగుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఆమని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక మరో కీలక పాత్రలో నటించిన వికాస్ వశిష్ఠ టెర్రిఫిక్ గా కనిపించారు. తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో వికాస్ వశిష్ఠ చాలా బాగా మెప్పించాడు. మౌనిక రెడ్డి కూడా తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది.

లాయర్ పాత్రలో ప్రగతి, ముఖ్య పాత్రల్లో సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ తమ నటనతో మెప్పించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సినిమాలో భారతి (ఆమని) పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన ఆనంద్, అభయ్ పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. ముఖ్యంగా సినిమా నేపథ్యం.. ఇలా మొత్తానికి ఈ సినిమాలో గుడ్ పాయింట్ తో పాటు గుడ్ మెసేజ్ ఉంది.

మైనస్ పాయింట్స్ :

ఈ నారి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో సూర్య వంటిపల్లి విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే లో ఎక్కడా ఇంట్రెస్ట్ లేదు. పైగా చాలా చోట్ల కొన్ని కీలక సన్నివేశాలు కూడా చాలా పేలవంగా ఉన్నాయి. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు కథలో క్యూరియాసిటీ అండ్ టెన్షన్ బిల్డప్ చేస్తూ ప్లే రాసుకోవాలి. కానీ, ఈ నారి కథలో తర్వాత రాబోయే సీన్ ఏమిటి అనేది సగటు ప్రేక్షకుడికి కూడా క్లారిటీగా అర్ధం అవుతూ ఉంటుంది.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పెరగాలి. కానీ ఈ నారిలో అది కూడా మిస్ అయింది. కథలో టెంపో పెంచకుండా సినిమాని రెగ్యులర్ గానే ముగించారు. దాంతో సినిమా సింపుల్ గా ముగిసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సూర్య వంటిపల్లి స్క్రీన్ ప్లేలో కూడా మెరుపులు లేవు. పైగా సింగిల్ ట్రాక్ మీదే సెకండ్ హాఫ్ మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా దర్శకుడు మంచి మెసేజ్ అయితే ఇచ్చాడు గానీ, అది స్క్రీన్ మీద బాగా వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. ఎడిటింగ్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాత శశి వంటిపల్లి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

నారి అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, ముఖ్యంగా సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల కోణంలో సాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ప్లే బాగా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, సినిమాలో ఆమని, వికాస్ వశిష్ఠ ల నటన ఆకట్టుకున్నాయి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు