“డార్లింగ్” హిందీ ఓటిటి, శాటిలైట్ హక్కులు వారికే

“డార్లింగ్” హిందీ ఓటిటి, శాటిలైట్ హక్కులు వారికే

Published on Jul 19, 2024 9:00 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు ప్రియదర్శి అలాగే నభా నటేష్ లు హీరో హీరోయిన్స్ గా దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “డార్లింగ్”. మరి రీసెంట్ గా మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నిన్న సాయంత్రం ప్రీమియర్స్ తోనే పలకరించింది. ఇక నేటి నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా థియేటర్స్ లోకి వచ్చేసిన ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమా తెలుగు సంబంధించి ఓటిటి హక్కులు స్టార్ సంస్థలు స్టార్ మా, డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు కేవలం సౌత్ వరకు మాత్రమే కాగా ఇప్పుడు హిందీ హక్కులు సంబంధించి అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్ సహా శాటిలైట్ హక్కులని ప్రముఖ సంస్థ ఆర్ కె డి స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నారు. సో హిందీ వెర్షన్ మాత్రం వీరి నుంచి రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు