నాగ్ అశ్విన్ న‌టించిన సినిమాలు ఏమిటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం ‘క‌ల్కి 2898 AD’ ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించేందుకు సిద్ధ‌మైంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఆయ‌న్ను ప్రశంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ‘ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత మ‌హాన‌టి, క‌ల్కి సినిమాల‌ను తెర‌కెక్కించారు. అయితే, ద‌ర్శ‌కుడిగా మార‌కముందు నాగ్ అశ్విన్ కొన్ని సినిమాల్లో న‌టించిన సంగ‌తి చాలా త‌క్కువ మందికి తెలుసు. మంచు మ‌నోజ్ న‌టించిన ‘నేను మీకు తెలుసా?’ సినిమాతో పాటు శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ‘లీడ‌ర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాల్లో చిన్న పాత్ర‌ల్లో క‌నిపించారు నాగ్ అశ్విన్.

శేఖర్ క‌మ్ముల ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసిన నాగ్ అశ్విన్, ఇప్పుడు కేవ‌లం మూడు సినిమాల‌తోనే టాప్ డైరెక్ట‌ర్ గా మారిపోయాడు. ఇక కల్కి సినిమాను సైన్ ఫిక్ష‌న్ మూవీగా నాగ్ అశ్విన్ రూపొందించాడు.

Exit mobile version