“కల్కి 2” లో ప్రభాస్ రోల్ పై నాగ్ అశ్విన్ సాలిడ్ స్టేట్మెంట్..!

“కల్కి 2” లో ప్రభాస్ రోల్ పై నాగ్ అశ్విన్ సాలిడ్ స్టేట్మెంట్..!

Published on Aug 24, 2024 11:00 AM IST

గత కొన్ని రోజులు నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ కోసం సోషల్ మీడియాలో వైరల్ గా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేసిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” విషయంలో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. అయితే ఈ క్రమంలోనే సినిమా ఓటిటి రిలీజ్ కి కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ సోషల్ మీడియాలో దర్శకుడు నాగ్ అశ్విన్ యాక్టీవ్ గా మారాడు. అయితే లేటెస్ట్ గా అర్షద్ కాంట్రవర్సీపై తాను కౌంటర్ ఇచ్చాడు.

అర్షద్ సాబ్ మీరు మీ మాటలు బెటర్ గా వాడాల్సింది. అయినా సరే ఓకే మీ పిల్లలకి ‘బుజ్జి’ బొమ్మలను పంపిస్తాను అని తెలిపాడు. అలాగే కల్కి పార్ట్ 2 లో ప్రభాస్ రోల్ కోసం కూడా సాలిడ్ అప్డేట్ ని అందించాడు. పార్ట్ 1 లో ఏదైతే ప్రభాస్ పాత్ర కోసం అంతా కామెంట్స్ చేసారో పార్ట్ 2 లో ఖచ్చితంగా ప్రభాస్ ఒక్కరి కోసమే అంతా మాట్లాడుకునేలా వర్క్ చేస్తాను అని పార్ట్ 2 లో బెస్ట్ ఎవర్ ప్రభాస్ ని చూపిస్తాను అని సాలిడ్ స్టేట్మెంట్ ని నాగ్ అశ్విన్ అందించాడు. దీనితో తన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు