“కల్కి” లోని క్లైమాక్స్ ప్రభాస్ కి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది – నాగ్ అశ్విన్

“కల్కి” లోని క్లైమాక్స్ ప్రభాస్ కి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది – నాగ్ అశ్విన్

Published on Jun 26, 2024 10:00 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రేపు రిలీజ్ కి రెడీ అవ్వడంతో సినిమాకి సంబందించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు నాగ్ అశ్విన్.

క్లైమాక్స్ ప్రభాస్ కి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది అని, తన ఫేవరెట్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ క్లైమాక్స్ లో ఉంటుంది అని తెలిపారు. ఈ సాంగ్ మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక, ఇతర ప్లాట్ ఫామ్ లలో ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు