‘కల్కి 2’పై దర్శకుడు ట్విస్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లాస్ట్ భారీ హిట్ చిత్రం కల్కి 2898 ఎడి కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కాకుండా ఇపుడు మరిన్ని ఇతర సినిమాలతో తాను బిజీగా ఉండగా ఈ చిత్రంపై సీక్వెల్ పట్ల కూడా గట్టి హైప్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 2 కి తాను దాదాపు చాలా పనులు కూడా కంప్లీట్ చేశారు కానీ ప్రభాస్ నుంచి కూడా డేట్స్ సెట్ అయితే సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ అయ్యిపోయినట్టే అని చెప్పవచ్చు.

మరి ఈ నేపథ్యంలో కల్కి 2 పై దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విస్ట్ ఇవ్వడం వైరల్ గా మారింది. కల్కి 2 వచ్చేందుకు చాలా సమయం ఉందని తాను కన్ఫర్మ్ చేశారు. అంటే షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదనే చెప్పక తప్పదు. మరి చూడాలి. ఈ అవైటెడ్ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందో ఏంటి అనేది. ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించనున్నారు.

Exit mobile version