‘క‌ల్కి 2898 AD’ – భైర‌వ ఎంట్రీ అప్పుడే!

ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ మ‌రికొద్ది గంట‌ల్లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్ర‌తిష్టాత్మకంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాతో ప్ర‌భాస్ బాక్సాఫీస్ వద్ద మ‌రోసారి విధ్వంసం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా ‘క‌ల్కి’ మూవీ టికెట్ బుకింగ్స్ దూసుకుపోతున్నాయి.

కాగా, ఈ సినిమాలో భైర‌వ పాత్ర‌లో ప్ర‌భాస్ అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ‘క‌ల్కి’ మూవీలో భైర‌వ ఎంట్రీ గురించి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఓ లీక్ ఇచ్చాడు. ఆయ‌న తాజాగా త‌న ఇన్స్టా లైవ్ లో ఈ విష‌యంపై మాట్లాడారు. ‘క‌ల్కి’ సినిమా ప్రారంభమైన 20 నిమిషాల‌కు భైర‌వ ఎంట్రీ ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

అయితే, భైర‌వ ఎంట్రీ మాత్రం చాలా స్టైలిష్ అండ్ ప‌వ‌ర్ఫుల్ గా ఉంటుంద‌ని నాగ్ అశ్విన్ అన్నారు. ప్రేక్ష‌కులు ఈ ఎంట్రీ సీన్ కు విజిల్స్ తో ర‌చ్చ చేయ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న అన్నారు. దీంతో భైర‌వ ఎంట్రీ ఎలా ఉండ‌బోతుందా అని ఆస‌క్తిగా చూస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, కమ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న క‌ల్కి చిత్రాన్ని సి.అశ్వినిద‌త్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version