“కల్కి 2898 ఎడి” సీక్వెల్ కాదు అంతకు మించి ప్లాన్ చేసిన నాగ్ అశ్విన్

“కల్కి 2898 ఎడి” సీక్వెల్ కాదు అంతకు మించి ప్లాన్ చేసిన నాగ్ అశ్విన్

Published on Jun 27, 2024 12:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పడుకోణ్(Deepika Padukone) అలాగే దిశా పటాని ఇంకా తదితర బిగ్ స్టార్స్ కలయికలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం ఇప్పుడు అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం యావత్తు పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు.

అయితే ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లో పడిపోయింది. ఇక అభిమానుల అంచనాలు కూడా ఈ చిత్రం అందుకోవడంతో సాలిడ్ టాక్ పడిపోయింది. అయితే అన్ని చిత్రాల్లానే ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉందా లేదా అనేది మాత్రం నాగ్ అశ్విన్ ఇపుడు వరకు దాస్తూ వచ్చాడు. కానీ సినిమాతో మాత్రం అందరికీ సమాధానం ఇచ్చాడు.

అది కూడా సీక్వెల్ ని మించి ఇచ్చాడు అని చెప్పాలి. కల్కి నుంచి ఒక్క సీక్వెల్ కాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్స్ ఉంటుంది అని రివీల్ చేసాడు. దీనితో రానున్న రోజుల్లో మాత్రం ఈ సినిమా సహా మరిన్ని క్రేజీ ట్రీట్ లు రానున్నాయి అని చెప్పవచ్చు. మరి వాటి విషయంలో నాగ్ అశ్విన్ ఎలా ప్లాన్ చేసుకున్నాడో అనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు