యూఎస్ ఆడియెన్స్ కి నాగ్ అశ్విన్ థాంక్స్!

యూఎస్ ఆడియెన్స్ కి నాగ్ అశ్విన్ థాంక్స్!

Published on Jun 30, 2024 10:59 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి చిత్రం థియేటర్ల రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. యూఎస్ ప్రాంతంలో ఈ చిత్రం సూపర్ గా పెర్ఫామ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 10.2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ఈ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు.

నార్త్ అమెరికా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, థాంక్స్ తెలిపారు. నచ్చితే స్నేహితులకు, బంధువులకు చెప్పమని అన్నారు. చిన్నారులకు కూడా ఇలాంటి చిత్రంను చూపించమని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రం రావడం చాలా అరుదు అంటూ చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కి తొలి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ తో పాటుగా ఈ చిత్రంలో దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు