క‌ల్కి, మాయాబ‌జార్.. రెండూ ఒక‌టే – నాగ్ అశ్విన్

క‌ల్కి, మాయాబ‌జార్.. రెండూ ఒక‌టే – నాగ్ అశ్విన్

Published on Jul 5, 2024 5:35 PM IST

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన లేటెస్ట్ మైథాలజీ సై ఫై మూవీ ‘క‌ల్కి 2898 AD’ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమా స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుండ‌టంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మీడియాతో ఇంట‌రాక్ట్ అవుతున్నారు.

ఈ సంద‌ర్భంగా ”క‌ల్కి సినిమాలో మ‌హాభారతం సీన్స్ పెట్టారు క‌దా.. దీనికి స్పూర్తి ఏమిట‌ని” ఓ విలేక‌రి ప్ర‌శ్నించారు. దీనికి సమాధానంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ”తెలుగు సినిమా అంటే మ‌న‌కు ముందు గుర్తొచ్చేది మాయాబ‌జార్. ఆ సినిమా కూడా మ‌హాభార‌తానికి సంబంధించిందే. కానీ, వాస్త‌వానికి మ‌హాభార‌తంలో ఆ స‌న్నివేశాలు ఎక్క‌డా లేవు. నేను కూడా ఆ సినిమా స్పూర్తితోనే క‌ల్కి క‌థను రాసుకున్నాను. నా దృష్టిలో క‌ల్కి, మాయాబ‌జార్ రెండూ ఒకటే” అంటూ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి క‌ల్కి సినిమాకు మాయాబ‌జార్ చిత్రం స్పూర్తిగా నిల‌వ‌డం హ‌ర్ష‌నీయం అని అభిమానులు అంటున్నారు. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు