తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో ఓ సరికొత్త కథాంశంతో మన ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌తో కలిసి సూర్య సొంతంగా నిర్మించడం విశేషం.
యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ వర్షన్ ఆడియోను మే 8నే విడుదల చేయగా తెలుగు ఆడియోను మే 18న విడుదల చేయనున్నారు. ఈ ఆడియో వేడుకను గతంలో ఏ డబ్బింగ్ సినిమాకూ చేపట్టనంత భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. మే 18న శిల్పకళావేదికలో జరగనున్న ఆడియో ఆవిష్కరణ వేడుకకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, కింగ్ నాగార్జున హాజరు కానుండడంతో ఈ వేడుకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అదేవిధంగా రిలీజ్‌కు ముందు కూడా తెలుగు, తమిళంలో ఈ సినిమాకు భారీ ప్రమోషన్ కల్పించే పనిలో సినిమా యూనిట్ ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘రాక్షసుడు'(మాస్) ట్రైలర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మే 29న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్న విషయం తెలిసిందే.


