హరోం హర: సుధీర్ బాబు కు చైతూ బెస్ట్ విషెస్!

హరోం హర: సుధీర్ బాబు కు చైతూ బెస్ట్ విషెస్!

Published on Jun 14, 2024 12:01 AM IST

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో, దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరోం హర ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. సినిమా రిలీజ్ సందర్భంగా అక్కినేని హీరో నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా సుధీర్ బాబుకి శుభాకాంక్షలు తెలిపారు.

మీరు ప్రతి పాత్రకి రూపాంతరం చెందడాన్ని చూసి మెచ్చుకుంటున్నా. మీకు ఎల్లప్పుడూ శుభాకాంక్షలు. మీ టిక్కెట్లు బుక్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ కథానాయికగా నటించడం జరిగింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ మరియు రవి కాలే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు