స‌త్తా చాటుతున్న నాగ‌చైత‌న్య ‘ధూత‌’

స‌త్తా చాటుతున్న నాగ‌చైత‌న్య ‘ధూత‌’

Published on Jul 18, 2024 9:33 PM IST

అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్య ప్ర‌స్తుతం తండేల్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ హీరో కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రీసెంట్ గా ధూత అనే వెబ్ సిరీస్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ ఇప్ప‌టికే స్ట్రీమింగ్ కూడా అవుతుంది. ఆడియెన్స్ ఈ వెబ్ సిరీస్ కు మంచి మార్కులు వేశారు. అయితే, తాజాగా ఈ వెబ్ సిరీస్ ప‌లు అవార్డుల‌కై పోటీ ప‌డుతుండ‌టం విశేషం. ప్రెస్టీజియ‌స్ ఇండియ‌న్ టెల్లి స్ట్రీమింగ్ అవార్డ్స్ మరియు స్ట్రీమింగ్ అకాడెమీ అవార్డ్స్ ల‌లో ధూత ప‌లు విభాగాల్లో నామినేట్ అయ్యింది.

దీంతో ధూత మేక‌ర్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ వెబ్ సిరీస్ కు ఆడియెన్స్ నుండే కాకుండా ఇలా అవార్డుల నామినేష‌న్స్ నుండి కూడా గుర్తింపు ల‌భించ‌డం సంతోషంగా ఉంద‌ని వారు అంటున్నారు. ఈ మిస్టరీ థ్రిల్ల‌ర్ సిరీస్ ను విక్ర‌మ్ కుమార్ డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు