అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
అయితే, ఈ సినిమా రిలీజ్‌కి ముందే నాగచైతన్య నెక్స్ట్ మూవీ గురించి సినీ సర్కిల్స్‌లో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్లో నాగచైతన్య తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. అయతే, ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.110 కోట్ల మేర కేటాయించనున్నారట మేకర్స్. ఇందులో రూ.30 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్కే వెచ్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఈ సినిమాపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రొరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.