‘థాంక్యూ’ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నాగ చైతన్య, రాశిఖన్నా

‘థాంక్యూ’ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నాగ చైతన్య, రాశిఖన్నా

Published on Jun 24, 2022 12:00 AM IST

ఇటీవల లవ్ స్టోరీ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చిన నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ఆ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. దాని అనంతరం ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ థాంక్యూ. గతంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితో కలిపి మనం మూవీ తీసి మంచి సక్సెస్ అందుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ ఫై బాగా అంచనాలు క్రియేట్ చేసాయి.

ఇక జులై 8న గ్రాండ్ గా రిలీజ్ కానున్న థాంక్యూ మూవీ ప్రమోషన్స్ ని నేటి నుండి స్టార్ట్ చేసారు నాగ చైతన్య, రాశి ఖన్నా. ప్రస్తుతం వారిద్దరి నుండి పలు మీడియా ఛానెల్స్ వారు ఇంటర్వ్యూస్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఆకట్టుకునే కథ, కథనాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకడు విక్రమ్ కె కుమార్ తీసిన ఈ సినిమాలో హీరో చైత్య పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, ముఖ్యంగా సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ అందరినీ ఎంతో అలరిస్తాయని అంటోంది యూనిట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫి అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు