తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులపై ఆమె చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. రాజకీయాల కోసం ఇలా సినీ వ్యక్తుల జీవితాలను అడ్డు పెట్టుకోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ మండిపడుతున్నారు. ఇలా తమ కుటుంబ పరువును రాజకీయాల కోసం వాడుకోవడం ఏమిటని.. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక సమంత కూడా ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. తాజాగా నాగచైతన్య కూడా మంత్రి మాటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఇద్దరు వ్యక్తులు అన్ని విధాలుగా ఆలోచించుకుని తమ జీవితంలో ముందుకు సాగేందుకు వేర్వేరు దారులను ఎంచుకోవడం వారి వ్యక్తిగత విషయం అని.. తమ విడాకులపై వస్తున్న వార్తలపై తాను ఎంతగానో భాదపడుతున్నానని.. అయితే, నేడు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఆయన అన్నాడు. మహిళలను గౌరవించాలని, సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలను రాజకీయాల కోసం వాడుకోవడం సిగ్గుచేటు అంటూ ఆయన తన అభ్యంతరం తెలియజేశాడు.
— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2024