ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “థాంక్ యూ”..!

Published on Aug 11, 2022 7:30 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “థాంక్ యూ” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం అనుకోని విధంగా బాక్సాఫీస్ దగ్గర వైఫల్యం అయ్యింది. మరి ఈ చిత్రం అయితే చిత్రం ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ప్రముఖ స్ట్రీమింగ్ ప్రైమ్ వీడియో వారు ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకోగా ఈరోజు ఆగస్ట్ 11 నుంచి అయితే మేకర్స్ ఈ సినిమాని అందులో స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి అప్పుడు మిస్సయిన వారు అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో అయితే రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :