‘నాగచైతన్య – శింబు’లతో పరుశురామ్ మల్టీస్టారర్ ?

డైరెక్టర్ పరుశురామ్ నాగచైతన్య తో ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా పై మరో వార్త కూడా వినిపిస్తోంది. ఈ సినిమా మల్టీస్టారర్ అని.. ఈ సినిమాలో తమిళ హీరో శింబు కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.

పరశురామ్ ఇప్పటికే ఇటు నాగచైతన్యకి, అటు పరుశురామ్ కి ఈ కథకు సంబంధించిన పాయింట్ కూడా చెప్పాడని.. ప్రస్తుతం పరశురామ్ పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనుల్లో ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి నాగచైతన్య – శింబు కాంబినేషన్ నిజం అయితే మాత్రం ప్రేక్షకుల్లో ఈ సినిమా పై భారీ ఇంట్రెస్ట్ ఉంటుంది.

పైగా ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత పరశురామ్ చేస్తున్న సినిమా కాబట్టి.. ఈ సినిమా పై భారీ అంచనాలు కూడా ఉంటాయి. మరి నాగచైతన్య – శింబు కోసం పరుశురామ్ ఎలాంటి కథ రాశాడో చూడాలి.

Exit mobile version