మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చతన్య అక్కినేని మంచి ఫైనెస్ట్ నటుడే కాకుండా ఒక స్పోర్ట్స్ ఫ్రీక్ అని కూడా చాలా మందికి తెలిసిందే. పలు స్పోర్ట్స్ కార్స్ తో ట్రాక్ పై చైతూ చేసే విన్యాసాలు రేసింగ్ లు అబ్బురపరుస్తాయి. అలాగే ఆ మధ్య మన టాలీవుడ్ భారీ సినిమా “కల్కి 2898 ఎడి” కోసం స్పెషల్ గా రెడీ చేసిన బుజ్జి కార్ ని కూడా రేసింగ్ ట్రాక్ పై నడిపి అదరగొట్టాడు.
అయితే లేటెస్ట్ గా తన ఖరీదైన స్పోర్ట్స్ అండ్ సూపర్ కార్ తో నాగ చైతన్య సాలిడ్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. ప్రముఖ కార్స్ బ్రాండ్ పోర్షే నుంచి రీసెంట్ ఎడిషన్ 992 జిటి3 ఆర్ఎస్ ని ట్రాక్ పై పెట్టి ఇంట్రెస్టింగ్ కొటేషన్ కూడా పెట్టాడు. తన కార్ దాని వైపు హెల్మెట్ పెట్టుకొని చూస్తున్న చైతూ.. 992 జిటి3 ఆర్ఎస్ మీకు ఎగిరేందుకు రెక్కలు ఇస్తుంది కానీ అది నేల మీదే ఉంచుతుంది” అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసాడు. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం చైతూ తండేల్ అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.