‘లవ్ స్టోరీ’కి ఇది సరైన సమయం కాదా ?

Published on Apr 8, 2021 10:07 pm IST

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా టైటిల్. ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. పైగా ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందునా సాయి పల్లవి హీరోయిన్ కావడం అంచనాలను మరింత పెంచింది. ఇక ‘సారంగ దరియా’ సాంగ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. యూట్యూబ్ వ్యూస్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటతోనే సినిమాకు విపరీతమైన ప్రచారం లభించింది.

ఈ నెల 16వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడేమో ఆ తేదీని మార్చాలని చూస్తున్నారట టీమ్. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పడుతుందనే అనుమానంతోనే ఈ వాయిదా అని అంటున్నారు. అయితే ఈ వార్తలు నిజమో కాదో ఇంకా తెలియాల్సి ఉంది. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :