చైతూ సినిమాకు భారీ ఆఫర్.. అయినా నో అంటున్నారట

Published on Sep 29, 2020 3:00 am IST


నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నారు. సాయి పల్లవి ఇందులో కథానాయిక. ఈ క్రేజీ కాంబినేషన్ మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది ప్రేక్షకుల్లో. ఈ సినిమా షూటింగ్ రేపటితో ముగియనుంది. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల సినిమా కావడం, వరుస విజయాలతో ఉన్న నాగ చైతన్య హీరో కావడంతో ఈ చిత్రం మీద వ్యాపార వర్గాల్లో సైతం హైప్ ఉంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితులు కావడంతో అంతా ఓటీటీ హావానే నడుస్తోంది. ఓటీటీ సంస్థలు భారీ మొత్తం వెచ్చించి సినిమాలను కొనడానికి ముందుకొస్తున్నాయి.

అలా చైతూ, కమ్ముల సినిమా మీద కూడ బడా ఓటీటీ సంస్థ ఒకటి ఆసక్తిగా చూపుతోందిని, భారీ మొత్తం చెల్లించి హక్కులు కొనడానికి సిద్దంగా ఉందని తెలుస్తోంది. అయితే హీరో, దర్శకుడు, నిర్మాతలు ఆలస్యమైనా కూడ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ధృడంగా నిర్ణయించుకున్నారట. అందుకే ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా ఓటీటీ విడుదలకు మాత్రం నో చెబుతున్నారట. ఇకపోతే నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తమ కలల్ని నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా ఉండనుంది.

సంబంధిత సమాచారం :

More