అమ్మతో ఆవకాయ్ కలుపుతున్న యంగ్ హీరో

అమ్మతో ఆవకాయ్ కలుపుతున్న యంగ్ హీరో

Published on Mar 22, 2020 2:31 PM IST

కరోనా వైరస్ కారణంగా అందరూ ఇంటికే పరిమితం కావాలని నేడు జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. సామాన్య జనం నుండి సెలెబ్రిటీల వరకు నేడు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ విరామ సమయాన్ని హీరోలు కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతున్నారు . కాగా యంగ్ హీరో నాగ శౌర్య అమ్మతో కలిసి ఆవకాయ ప్రిపరేషన్ లో పాల్గొన్నారు.

నాగ శౌర్య అమ్మగారైన ఉషా మూల్పూరి పర్యవేక్షణలో ఆవకాయ్ పచ్చడి తయారీ నేర్చుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారింది. నాగ శౌర్య లేటెస్ట్ మూవీ అశ్వథామ మంచి విజయం అందుకుంది. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా, నూతన దర్శకురాలు లక్ష్మీ డైరెక్షన్ లో ఓ కొత్త చిత్రాన్ని ఆయన ప్రారంభించారు. రీతూ వర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు