డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న నాగ శౌర్య లేటెస్ట్ మూవీ!


టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు ఈ చిత్రం థియేటర్ల లోకి వచ్చింది.

ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ రైట్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోగా, SunNXT డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం లో మాలవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version