8 పలకల దేహం కోసం శౌర్య స్ట్రిక్ట్ డైట్..!

Published on Sep 24, 2020 4:21 pm IST

టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇప్పుడు ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గాను నాగ శౌర్య ఊహించని విధంగా 8 పలకల దేహంతో కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

అయితే నాగశౌర్య ఈ లుక్ ను సిద్ధం చేసిన దానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. నాగ శౌర్య ఈ 8 ప్యాక్స్ ను మైంటైన్ చెయ్యడానికి నీరు తాగకుండా ఉండడమే కాకుండా కనీసం తన లాలాజలాన్ని కూడా మింగలేదని మేకర్స్ తెలిపారు. అంతే కాకుండా దీనితో పాటుగా ఒక స్ట్రిక్ట్ డైట్ ను కూస్తో తీసుకున్నాడట.

కేటో డైట్ అనే దీనిలో భాగంగా కేవలం చేప ఉడికించిన కూరగాయలు అందులోను ఎలాంటి ఉప్పు లేకుండా..దీనితో పాటుగా కాలీఫ్లవర్ ను ఎక్కువగా తీసుకునేవాడట. దీనితో నాగశౌర్య కు ఈ స్టన్నింగ్ లుక్ సాధ్యం అయ్యిందట. ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశం కోసం నాగశౌర్య ఇలా మారాల్సి వచ్చింది. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More