స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్. ఈ చిత్రం సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం సక్సెస్ పై డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదిక గా ప్రశంసల వర్షం కురిపించారు. డీజే టిల్లు, సార్, మ్యాడ్ ఇప్పుడు టిల్లు స్క్వేర్ (Tillu square). అన్నీ కూడా ప్రొడ్యూసర్ నాగ వంశీ గట్స్ మూవ్స్. ఇవి అతన్ని ప్రత్యేకం గా మార్చాయి. యంగ్ ప్రొడ్యూసర్ లలో కొత్త స్పేస్ ను క్రియేట్ చేయడం జరిగింది.
ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ని తీసుకురావడానికి ఆయన చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు చాలా ఆనందంగా ఉంది. రాకింగ్ సర్, మీరు చేస్తున్న పనికి అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు. హరీష్ చేసిన కామెంట్స్ కి, నాగ వంశీ రెస్పాండ్ అవుతూ, మీ మాటలకు ధన్యవాదాలు హరీష్ గారు. మీకు తెలిసినట్లుగా, మేము ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాము. మరియు వారు వాటిని ఇష్టపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సరే, అంతా చెప్పేశారు, మీరు మాత్రం నాకు సినిమా చేయట్లేదు ఇంకా అని అన్నారు.
Thank you @harish2you garu for such warm words. As you know, we try to deliver a good theatrical experience for audiences and I'm glad they're liking them. Well, all said and done… Meeru matram naku cinema cheyatledhu inka ???? https://t.co/OLR64moob3
— Naga Vamsi (@vamsi84) April 7, 2024