‘డాకు మహారాజ్’లో ‘సమర సింహారెడ్డి’ తరహా సీక్వెన్స్

‘డాకు మహారాజ్’లో ‘సమర సింహారెడ్డి’ తరహా సీక్వెన్స్

Published on Jan 3, 2025 9:00 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందించారు. ఇక బాలయ్య ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

అయితే, ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేలా ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ఓ పోస్ట్ పెట్టారు. డాకు మహారాజ్ చిత్రంలోని సెకండాఫ్‌లో ఓ సీక్వెన్స్ ఉంటుందని.. ఇది సమర సింహారెడ్డి తరహా ఎపిసోడ్‌లా ఉంటుందని.. అభిమానులను తిరిగి పాత రోజులకు తీసుకెళ్లడం ఖాయమని.. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు.. అంటూ నాగవంశీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో సమర సింహారెడ్డి మూవీలోని పవర్‌ఫుల్ డైలాగ్స్, బాలయ్య ఊచకోత తరహా సీక్వెన్స్ ‘డాకు మహారాజ్’లోనూ ఖాయంగా ఉండబోతుందని అభిమానులు ఈ సినిమా కోసం మరింత ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు