‘దబిడి దిబిడి’ సాంగ్‌పై నిర్మాత కామెంట్స్.. మాస్ స్టెప్స్ మాత్రమే!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్ల డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.

అయితే, ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘దబిడి దిబిడి’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. ఈ సాంగ్‌లో బాలయ్య వేసిన స్టెప్పులను ట్రోలర్స్ నెగెటివ్‌గా ట్రోలింగ్ చేశారు. దీంతో ఈ సాంగ్‌పై.. అందులో డ్యాన్స్ స్టెప్పులపై నిర్మాత నాగవంశీ తాజాగా స్పందించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దబిడి దిబిడి సాంగ్‌ను ప్యూర్ మాస్ ఆడియెన్స్ కోసం తెరకెక్కించాం.. ఇందులో బాలయ్య మాస్ స్టెప్పులు తప్ప నాకెక్కడా వల్గారిటీ కనిపించలేదు.. పాట రిలీజ్ అయిన రోజు నుంచి కొంత నెగెటివ్ కామెంట్స్ వచ్చిన విషయం నిజమే.. కానీ, ఈ పాట థియేటర్ లో అందరికీ నచ్చుతుంది..’ అంటూ నాగవంశీ కామెంట్ చేశారు.

బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాధ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version