టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా భారీ యాక్షన్ డ్రామా చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను పెంచాయి.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా.. అనే అంశంపై చిత్ర నిర్మాత నాగవంశీ తాజాగా స్పందించారు. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ‘కింగ్‌డమ్’ చిత్ర సీక్వెల్‌పై మాట్లాడారు. దర్శకుడు గౌతమ్ తనకు చెప్పిన కథ రెండు భాగాలకు సంబంధించినది అని.. అయితే, ఇప్పుడు తెరకెక్కించింది తొలి భాగమని.. అయితే, రెండో భాగానికి స్క్రీన్ ప్లే వేరేలా ఉంటుందని నాగవంశీ తెలిపారు.
కింగ్‌డమ్ సినిమాలో భారీతనం, యాక్షన్.. ఇలా అన్ని అంశాలు కనిపిస్తాయని ఆయన అన్నారు. ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి సీక్వెల్ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఫిక్స్ చేస్తామని ఆయన అన్నారు. ఇక ‘కింగ్‌డమ్’ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 30న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.