“విజయ్ 12” టైటిల్ పై నాగ వంశీ క్రేజీ అప్డేట్!

“విజయ్ 12” టైటిల్ పై నాగ వంశీ క్రేజీ అప్డేట్!

Published on Jan 31, 2025 11:04 AM IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇపుడు చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న భారీ చిత్రం కూడా ఒకటి. విజయ్ కెరీర్లో 12వ సినిమాగా ఇది వస్తుండగా ఎప్పుడు నుంచో విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ పట్ల గత కొన్నాళ్ల నుంచి మంచి సస్పెన్స్ నెలకొనగా ఫైనల్ గా దీనిపై యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ సాలిడ్ అప్డేట్ అందించారు.

తన దర్శకుడు గౌతమ్ ని ఫుల్ గా హింస పెట్టి ఒక టైటిల్ ని అయితే లాక్ చేశామని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ టైటిల్ ని అతి త్వరలోనే రివీల్ చేస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఫైనల్ గా విజయ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చ్ నుంచి మరో నెల రిలీజ్ కి షిఫ్ట్ చేశారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు