NBK109 అప్డేట్స్.. దసరాకి రిలీజ్ డేట్.. దీపావళికి టైటిల్, టీజర్!

NBK109 అప్డేట్స్.. దసరాకి రిలీజ్ డేట్.. దీపావళికి టైటిల్, టీజర్!

Published on Oct 11, 2024 6:00 PM IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK109 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నాగవంశీ తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వెల్లడించారు. NBK109 చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను దసరా కానుకగా రేపు(అక్టోబర్ 12) అనౌన్స్ చేయబోతున్నామని.. అలాగే దీపావళి రోజున ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్ ఉంటుందని ఆయన రివీల్ చేశారు. దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

అంతేగాక, ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారా లేక వేరే ఏదైనా డేట్ ఇస్తారా అని కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు. దీంతో మరోసారి NBK109 సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు