లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రం “దేవర” కోసం తెలిసిందే. చాలా కాలం తర్వాత టాలీవుడ్ నుంచి ఓ భారీ సినిమా లేదు అనే టైం లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన “దేవర” తో వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ నుంచి ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సోలోగా వచ్చింది. మరి దీనికి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేశారు కానీ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అనుకోని విధంగా సినిమా ఈవెంట్ లేకుండానే విడుదల కావాల్సి వచ్చింది.
అయితే సినిమా సక్సెస్ అయ్యాక గ్రాండ్ సక్సెస్ మీట్ ని పెడతారని టాక్ వచ్చింది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇపుడు వచ్చింది. సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ మొదటిగా దేవరకి భారీ సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అయితే దేవర ప్రీ రిలీజ్ లేక అభిమానులు చాలా నిరాశ చెందారని అదే విధంగా తారక్ అన్న కూడా అభిమానులతో మాట్లాడాలని చాలా అనుకుంటున్నారు కానీ ప్రీ రిలీజ్ కుదరలేదు రిలీజ్ తర్వాత భారీ సక్సెస్ మీట్ ని అవుట్ డోర్ లో పెడదామని ప్లాన్ చేసాం కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల తాకిడి రీత్యా ఇంకా అనుమతులు రాలేదని అందుకే సక్సెస్ మీట్ ని అప్పుడే పెట్టలేకపోతున్నామని తెలిపారు.
అలాగే సక్సెస్ ఈవెంట్ ని పెట్టడానికి సర్వత్రా ప్రయత్నం అయితే చేస్తున్నామని దయచేసి అభిమానులు మమ్మల్ని అర్ధం చేసుకోవాలని తెలిపారు. మరి తారక్ స్పీచ్ కోసం గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. మరి ఈ భారీ ఈవెంట్ అవుతుందో లేదో వేచి చూడాలి.
A big thank you to each and every one of you who played a part in creating the #DevaraStorm and setting unprecedented records at the BOX OFFICE.
Since the pre-release event couldn’t be held, Tarak anna was adamant about having an event to CELEBRATE the Success of Devara in a BIG… pic.twitter.com/kyxAhy3CnN
— Naga Vamsi (@vamsi84) October 3, 2024