బన్నీ అల్లకల్లోలం చేస్తే చూడాలని ఉందట

Published on Oct 30, 2020 12:04 am IST


అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కానుంది. ఈ సినిమాపై బన్నీ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇన్నాళ్లు స్టైలిష్ లుక్ తో అలరించిన బన్నీ మొదటిసారి డీగ్లామర్ లుక్ ట్రై చేస్తుండటంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. మామూలు సినిమాల్లోనే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ చూపించి అదరగొట్టే బన్నీ ‘పుష్ప’లో ఏ స్థాయిలో చెలరేగిపోయి ఉంటాడో చూడాలని అభిమానులు ఆశగా ఉన్నారు. సినిమా గురించి ఏ చిన్న అప్డేట్, న్యూస్ వచ్చినా హడావిడి చేసేస్తున్నారు.

ఈరోజు మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు కావడంతో మెగా హీరోలంతా శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్ కూడ నాగబాబును తన ఫేవరెట్ పర్సన్ అంటూ విష్ చేశారు. దీంతో నాగబాబు బన్నీకి థ్యాంక్స్ చెబుతూ ‘పుష్ప’ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని, సిల్వర్ స్క్రీన్ మీద పుష్పగా నువ్వు చేసే అలకల్లోలం చూడాలనుకుంటున్నానని అన్నారు. నాగబాబు చేసిన ఈ ట్వీట్ తో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. అంటే సినిమాలో బన్నీ పెర్ఫార్మెన్స్ పీక్స్ అన్నమాట అంటూ సందడి చేస్తున్నారు.

వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా షూట్ రీస్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More