ప్రకాష్ రాజ్ కు నాగబాబు షాకింగ్ రిప్లై.!

Published on Nov 28, 2020 11:03 am IST

లేటెస్ట్ గా ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ప్రముఖ సినీ హీరో అండ్ పొలిటికల్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన పలు కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. పవన్ పై ఎన్నడూ లేని విధమైన సంచలన కామెంట్స్ ను ప్రకాష్ రాజ్ చేయడంపై మెగా బ్రదర్ అండ్ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి నాగేంద్ర బాబు కూడా అంతే స్థాయిలో ప్రకాష్ రాజ్ కు రిప్లై ఇవ్వడం షాకింగ్ గా మారింది. కేవలం రాజకీయ పరంగా మాత్రమే కాకుండా సినిమాల పరంగా కూడా నాగబాబు ప్రకాష్ రాజ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడం గమనార్హం.

ప్రకాష్ రాజ్ రాజకీయ పరిజ్ఞ్యానం పై సూటిగానే విమర్శించారు. అంతే కాకుండా నీలో డొల్లతనం సుబ్రహ్మణ్య స్వామి డిబేట్ లోనే తేలిపోయింది అని డబ్బుల కోసం నిర్మాతలను ఎన్ని రకాలుగా నువ్వు హింసలు పెట్టేవాడివో నాకు తెలుసు అని డైరెక్టర్స్ ను కాకా పట్టి నిర్మాతలను కాల్చుకుతిన్న నీకు ఇంతా కన్నా మంచిగా ఏం మాట్లాడ్డం తెలుసు అంటూ ఘాటు గానే తన సమాధానం ఇచ్చారు.అంతే కాకుండా మీడియా అడిగింది కదా అని నీ రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు అని విమర్శించారు. దీనితో ప్రకాష్ రాజ్ కు నాగబాబు ఇచ్చిన రిప్లై కూడా ఓ సంచలనంగా మారింది.

సంబంధిత సమాచారం :

More