యువ నటుడు అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించగా దీనికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. నాగచైతన్య పోలీస్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రముఖ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపించనున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ మే 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.
కాగా ఈ ద్విభాషా సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇక ప్రస్తుతం తమ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తోంది యూనిట్. అందులో భాగంగా నేడు ప్రత్యేకంగా మీడియాతో మూవీ గురించి పలు విషయాలు వెల్లడించారు నాగచైతన్య. ఈ సందర్భంగా ఆయన వేసుకున్న ట్రెండీ స్టైల్ వైట్ షర్ట్, బ్లూ జీన్స్ స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. నూనూగు మీసాలు, గడ్డంతో నాగచైతన్య అదరగొట్టిన ఈ లుక్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.