“బిగ్ బాస్ నాన్ స్టాప్” స్టేజ్ పై క్యాచ్ చేయమంటున్న నాగ్.!

ప్రపంచంలోనే అతి పెద్ద హిట్ అయినటువంటి గ్రాండ్ రియాలిటీ షో “బిగ్ బాస్” మన తెలుగు లో కూడా ఎంతో పెద్ద సక్సెస్ అయ్యింది. ఒక్క తెలుగులోనే కాకుండా మన దేశంలో కూడా ఈ షో హ్యుజ్ సక్సెస్ అయ్యింది. అయితే తెలుగులో ఇప్పటికే టెలివిజన్ పై 5 సీజన్లను విజవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు ఓటిటి లో “బిగ్ బాస్ నాన్ స్టాప్” గా స్టార్ట్ అయ్యి 24 గంటలు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తుంది.

అయితే ఈ కొత్త సీజన్లో ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. మరి ఈరోజు వీకెండ్ ఆదివారం కావడంతో గత సీజన్ల తాలూకా హోస్ట్ అయినటువంటి కింగ్ నాగార్జున ఈ ఓటిటి షో వీక్షకుల కోసం వస్తున్నట్టు తెలుపుతున్నారు. ఇప్పటివరకు అందరి లోని అన్ని ఎమోషన్స్ ని చూసారు. మరి సండే ఏం జరగబోతుందో చూద్దాం అంటూ ఈరోజు సాయంత్రం 6 గంటలకి తనని క్యాచ్ చెయ్యమని పోస్ట్ చేశారు. మరి నాగ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తారో చూడాలి.

Exit mobile version