కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కుబేర. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మేకర్స్ ధనుష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో కింగ్ నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ నాగార్జున పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.
పోస్టర్ డిఫెరెంట్ గా, సరికొత్తగా ఆకట్టుకుంటుంది. నాగార్జున లుక్ అభిమానులను అలరిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా, చిన్న వీడియో ను కూడా విడుదల చేసారు. వీడియో కూడా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.