‘బ్యాచ్‌ల‌ర్’ అవుట్ ఫుట్ బాగుందట !

Published on May 31, 2020 11:27 pm IST


అఖిల్ అక్కినేని ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది. అందుకే నాగ్ ఈ సినిమా పై ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాడు. లాక్ డౌన్ తో ఖాళీ సమయం దొరకడంతో అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున చూసి.. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ విషయంలో మాత్రం కొన్ని మార్పులు చేయమని చెప్పారట.

కాగా తాజాగా ఆ మార్పులను కూడా పూర్తి చేసిన వెర్సన్ ను చూసి నాగ్ చాల హ్యాపీగా ఫీల్ అయ్యారట. ఇక కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ ఆగష్టుకు మారే అవకాశం ఉంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More