తన ఎన్ కన్వెన్షన్ వార్తల పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నాగ్.!

తన ఎన్ కన్వెన్షన్ వార్తల పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నాగ్.!

Published on Aug 25, 2024 7:46 PM IST


ఇటీవల మన తెలుగు సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ని తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడం పేరిట కూల్చివేత మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం నుంచి ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా కూడా మారింది. అయితే దీనిపై నిన్ననే నాగార్జున న్యాయ పోరాటం చేస్తానని తెలిపి ఎమోషనల్ ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేశారు. అయితే తాజాగా ఈ వార్తల సంబంధించి కొన్ని వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి అని గ్రహించి మరో పోస్ట్ ని నాగ్ షేర్ చేసుకున్నారు.

దీనితో తన “ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ, N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) చట్టం, 24-02-2014న ఒక ఆర్డర్ ఎస్ ఆర్ 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను” అని నాగ్ తన ఎన్ కన్వెన్షన్ విషయంలో తన నుంచి వచ్చే క్లారిటీ లేదా వార్తలు తప్ప మిగతా రూమర్స్ ని నమ్మవద్దని విన్నవించుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు