టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం కావడంతో నాగ చైతన్య ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఎందుకంటే, గతంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అయిన సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరు విడిపోవడం పట్ల అభిమానులు సైతం విచారం వ్యక్తం చేశారు. అయితే నాగ చైతన్య ప్రస్తుతం సంతోషంగా ఉన్నట్లు, నాగ చైతన్య తండ్రి, అక్కినేని నాగార్జున వెల్లడించారు.
నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం విషయంలో మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. సమంతతో విడాకుల తర్వాత చై చాలా నరక వేదన అనుభవించాడు. కానీ ఆ బాధని ఎవరితో చెప్పుకోలేదు. ఇప్పుడు నా కొడుకు సంతోషంగా ఉండడం మాకు ఆనందంగా ఉంది అని అన్నారు. కింగ్ నాగార్జున చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరొక పక్క నాగ చైతన్య తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.