రీసెంట్ కాంట్రవర్సీకి చెక్ పెట్టిన నాగార్జున.!

మన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మథుడు కింగ్ నాగార్జున హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “నా సామిరంగ” తో మళ్ళీ తాను ఫామ్ లోకి రాగా ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమాకి గాను తాను బిజీగా ఉన్నారు. అయితే కాంట్రవర్సీలు లాంటి వాటికి ఎప్పుడు దూరంగా ఉండే నాగ్ రీసెంట్ గా తన ప్రమేయం లేకుండానే ఓ కాంట్రవర్సీలో పడ్డారు.

తాను ముంబై ఎయిర్ పోర్ట్ లో వస్తుండగా ఓ అభిమాని తన దగ్గరకి దూసుకెళ్తున్న సమయంలో సెక్యూరిటీ అతన్ని పక్కకు లాగేసారు. దీనితో ఈ విజువల్స్ ఒక్కసారిగా వైరల్ గా మరి నాగ్ పై విమర్శలు తీసుకొచ్చాయి. అయితే దీనిపై నాగ్ వెంటనే స్పందించి అది అనుకోకుండా జరిగింది అని వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆరోజున తనని విమర్శించిన అందరి నోర్లు తాను మూయించారు.

ఆరోజు ఏదైతే అభిమాని నాగ్ ని కలిసేందుకు ప్రయత్నించాడో ఇప్పుడు అదే అభిమానిని తాను కలిసి ఫోటో కూడా దిగారు. దీనితో ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అలాగే ఆరోజు నాగ్ పై విమర్శలు చేసిన వారు అంతా కూడా ఇపుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version