
టాలీవుడ్ స్టార్ హీరోస్ లు గానే కాకుండా తమ నటనతో తమ కంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ అక్కినేని నాగార్జున. ఇటీవలే ఈ ఇద్దరు హీరోలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే ప్రోగ్రాం లో బుల్లితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రతుతం చిరంజీవి తన 150వ సినిమా చేసే పనిలో ఉంటే నాగార్జున కూడా తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నాడు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జునని చిరుతో మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు చేస్తారని అడిగితే ‘ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. కానీ మంచి కథ దొరక లేదు. కానీ చిరు 150వ సినిమా సోలోగానే చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత మంచి కథ దొరికితే మేమిడ్డం కలిసి సినిమా చేస్తాం’ అని అన్నాడు.

