“శివ” విషయంలో నాన్నగారి మాటలే నిజమయ్యాయి.. నాగ్ ఎమోషనల్ పోస్ట్


మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో అక్కినేని నాగార్జున ఇప్పుడు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమాలతో పాటుగా పలు డిస్టబింగ్ ఘటనలు కూడా తాను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ తరుణంలోనే తన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా “శివ” టాలీవుడ్ లో 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

దీనిపై నిన్నంతా అభిమానులు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా విషయంలో నాగార్జున ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని షేర్ చేసుకున్నారు. ఐకానిక్ శివ వచ్చి 35 ఏళ్ళు గడిచిపోయింది. నాకు ఇంకా ఆరోజు గుర్తుంది. నాన్న గారితో కార్ డ్రైవింగ్ లో ఉన్నపుడు ఆయన అన్న మాట నిన్న రాత్రి సినిమా చూసాను ఉదయానికి సినిమా పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా పెద్ద హిట్ కాదు సౌత్ ఇండియా సినిమాలోనే అతి పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఆసక్తికరంగా ఆరోజు అన్నట్టుగానే శివ అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మీ మాటలే నిజమయ్యాయి నాన్న అంటూ అక్కినేని నాగేశ్వరరావు గారితో ఓ మధుర జ్ఞ్యాపకాన్ని నాగ్ షేర్ చేసుకున్నారు. అలాగే ఇన్నేళ్ళైనా అంతే ప్రేమ కనబరుస్తున్న అభిమానులకి శివ లాంటి సినిమాని ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని నాగ్ తెలిపారు. దీనితో తన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.

Exit mobile version