బొమ్మరిల్లు భాస్కర్ కి నాగ్ సూచనలు.

Published on Jun 4, 2020 2:03 am IST


అక్కినేని వారసుడు అఖిల్ అరంగేట్రం ఏమి బాగోలేదు. ఆయన చేసిన మొదటి మూడు ప్రయత్నాలు విఫలం చెందాయి. వివి వినాయక్ డైరెక్షన్స్ లో అఖిల్ పేరుతో భారీ బడ్జెట్ తో లాంచ్ చేశారు. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత ఆయన చేసిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా ఆయనకు విజయాన్ని కట్టబెట్ట లేకపోయాయి. కాగా ఆయన తన నాలుగవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టన్ లో చేస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. ఐతే ఈ సినిమాతో అయినా అఖిల్ కి హిట్ గిఫ్ట్ గా ఇవ్వాలని నాగార్జున చాలా ప్రయత్నాలు చేస్తున్నారట. ఓ సీనియర్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ కి స్క్రిప్ట్ విషయంలో అనేక సూచనలు సలహాలు ఇస్తున్నాడట. మరి నాగ్ సూచనలు ఎంత వరకు ఫలించాయో తెలియాలి అంటే మూవీ విడుదల కావాల్సిందే.

సంబంధిత సమాచారం :

More