కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ సెన్సార్ కంప్లీట్

Published on Sep 24, 2022 6:04 pm IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగార్జున కి జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా కనిపించనుండగా ఈ మూవీకి భరత్ సౌరభ్ సంగీతాన్ని మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కంపోజ్ చేసారు.

ఇక ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, వేగం అనే పల్లవితో సాగె సాంగ్, తమహాగనే థీమ్ సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ లతో అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. కాగా ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు నేడు జరుగగా మూవీకి యు/ఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బోర్డు వారు. పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్, సునీల్ నారంగ్ ఈ మూవీని ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆద్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీయడంతో పాటు తామందరం కూడా ఎంతో కష్టపడ్డాం అని, అలానే ఆడియన్స్ మా కష్టానికి తగ్గ ఫలితాన్ని అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది ది ఘోస్ట్ యూనిట్.

సంబంధిత సమాచారం :