నాగార్జున చేతిలో పడిన వైష్ణవ్ తేజ్

Published on Feb 26, 2021 3:00 am IST

మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఏ డెబ్యూ హీరోకి సాధ్యంకాని స్థాయిలో కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఈ సినిమాతో అతనికంటూ స్థిరమైన మార్కెట్ ఒకటి క్రియేట్ అయింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు సాన కూడ డెబ్యూ దర్శకుడే. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్నాం కాబట్టి పెద్ద దర్శకుడితోనో లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన దర్శకుడితోనో సినిమా చేయాలనే కండిషన్లకు పోకుండా కొత్త దర్శకుడితో వర్క్ చేశాడు వైష్ణవ్.

బహుశా అదే ఆయనకు ఈ స్థాయి సక్సెస్ ఇచ్చేదేమో. అందుకే తన తర్వాతి సినిమాకు కూడ అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు ఆయన. బ్లాక్ బస్టర్ తర్వాత కూడ స్టార్ డైరెక్టర్లను వెతుక్కుంటూ పోకుండా కొత్త దర్శకుడితో కమిటయ్యారు. అయితే ఆ దర్శకుడు ఎవరనేది ఇంకా బయటికి రాలేదు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కింగ్ నాగార్జున నిర్మించనుండటం విశేషం. ఉప్పెన విజయానికి తోడు నాగార్జున నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :